సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఘంటసాల కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి : పాటూరి.శ్రీనివాసులు
మధుర గాయకుడు ఘంటసాల గారి కీర్తి ప్రతిష్టలు సూర్యచంద్రుడు నంతకాలం చిరస్థాయిగా ఉంటాయని సీనియర్ గాయకుడు అపర ఘంటసాల పాటూరి శ్రీనివాసులు అన్నారు.
కేత అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ మంగళవారం ఏర్పాటుచేసిన గంటసాల వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా పాటలు పాడి ప్రజల హృదయంలో శాశ్వత స్థానం ఏర్పరచుకున్న ఘంటసాల ను ఈ దేశం ఏనాటికి మర్చిపోదన్నారు.
భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందటందుకు కారణం ఘంటసాల గారి గొంతే అని ఆయన కొనియాడారు. తెలుగు రాష్ట్రం కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు మరణం తెలియజేస్తూ గానం చేయడం వల్లనే తెలుగు ప్రజల్లో చైతన్యం కలిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
విద్యాసంస్థలలో ఘంటసాల గారి చరిత్రను తెలియజేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు కేత సుబ్బారావు. జయప్రకాష్. ప్రసాద్ బాబు. ఆనంద్. జనార్ధన్. రామచంద్రరావు. అమనుల ఖాన్. సీనయ్య. నాగరాజు.మారి.. అంకిరెడ్డి. రఘురాం తదితరులు పాల్గొన్నారు