సూళ్లూరుపేట/ గూడూరు.
17-1-2025,
శుక్రవారం.
*సుళ్ళూరు పేట అంబేద్కర్ విగ్రహం, గూడూరు టవర్ క్లాక్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన : కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్*
సూళ్లూరుపేట/ గూడూరు.
17-1-2025,
శుక్రవారం.
*సుళ్ళూరు పేట అంబేద్కర్ విగ్రహం, గూడూరు టవర్ క్లాక్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన : కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్
చింతామోహన్ కామెంట్స్
*********************
దళితుల విభజన దేశానికి పెను ప్రమాదం. దళితులను విభజిస్తే దేశం నాలుగు ముక్కలవుతుంది. “దళిత విభజన వద్దు – అది దేశానికి ముద్దు ”
చంద్రబాబు నాయుడు దళితులను కైమా చేస్తున్నాడు. ఇది తప్పు. వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
దళితులకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఉంది. దీన్ని నేను ఖండిస్తున్నాను.
ఇండ్లల్లో కూర్చొని దళితుల మౌనంగా ఉన్నారని, చంద్రబాబు నాయుడు ఊహించుకుంటున్నాడు. కానీ ఏరోజైనా, ఏ క్షణమైనా, దళితులు రోడ్లపైకి రాక తప్పదు.
విభజించి పాలించాలనే కుట్రలు జరుగుతావుంది. అందులో భాగంగానే కొంతమంది దుష్టశక్తులు సుప్రీం కోర్టుకి వెళ్లారు. పనికిమాలిన జడ్జిమెంట్ తెచ్చారు.
దాన్ని అడ్డం పెట్టుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేశారు.
మిశ్రా దళితుల ఇళ్లకు ఎప్పుడూ పోలేదు. కనీసం దళితులకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. మొన్న మిశ్రా ఒంగోలెల్లి దళితుల మధ్య తగాదా పెట్టాడు
భారత రాజ్యాంగంలో దళితులను విభజించమని, ఎక్కడా రాయలేదు.
దేశానికి స్వాతంత్రం రాకముందు అంటరానితనం ఘోరంగా ఉండేది. ఇంకా పూర్తిగా పోలేదు. కొన్ని రాష్ట్రాల్లో అంటరానితనం ఇంకా ఉంది. మన ప్రాంతంలో కూడా అక్కడక్కడా వుంది.
అంటరానితనంలో ఉన్న దళితులకు కాంగ్రెస్ పార్టీ, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ కృషి వల్ల దళితులకు 15%, గిరిజనులకు 7:30 శాతం రిజర్వేషన్లు వచ్చాయి.
సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కృషి వల్ల వెనుకబడిన వర్గాలకు 27% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించబడింది.
చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ దయవల్ల ఎమ్మెల్యే అయ్యాడు. మంత్రయ్యాడు. నేడు నాలుగోసారి ముఖ్యమంత్రై ఆయన చేయాల్సింది ఏమిటి??
ప్రతి ఇంటిలో నిరుద్యోగులున్నారు. ధరలు పెరిగిపోయింది. టాక్స్లు విపరీతంగా ఉంది. వీటి గురించి ఆలోచించకుండా, ఎస్సీ వర్గీకరణ పై పడ్డాడు.
ప్రభుత్వ ఉద్యోగాలెక్కడున్నాయి?? చిమ్మే ఉద్యోగాలకు, తుమ్మే ఉద్యోగాల కొరకు, పది పన్నెండు వేల రూపాయలు ఉద్యోగాల కొరకు ఏ, బి, సి, డి. లు అవసరమా??
చంద్రబాబు నాయుడూ… ఎందుకు ఈ కుట్ర పన్నావు?? స్టాలిన్ చేయలేని పని, కమ్యూనిస్టుల పాలిత రాష్ట్రం కేరళలో చేయలేని పని, BJP పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని పని నువ్వెందుకు చేశావయ్యా??
విభజన చట్టంలో రెండో అతి ముఖ్యమైన అంశంగా దుగరాజ పట్టణ ఓడరేవును తీసుకొచ్చాము. దాని గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు.
అమరావతి, పోలవరం అంటాడే తప్ప, దుగురాజపట్నం పోర్టుకు ఆలోచన చేయడం లేదు. వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాను.
పక్షుల పండుగ
************
పక్షుల పేరు పెట్టి 6 కోట్లు తెచ్చారు. దీంట్లో అవినీతి దాగివుంది. తిరుపతి జిల్లా కలెక్టర్ జాగ్రత్త!! 6 కోట్ల రూపాయల్లో అవకతవకలు జరిగితే నేనూరుకోను. విజిలెన్స్ కు చెప్తాను.
నేను ఎంపీగా ఉన్న రోజుల్లోనే పులికాట్ సరస్సుకు రోడ్లు వేయించాను. కరెంటు ఇప్పించాను.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామకృష్ణారావు, దయాకర్, వెంకటయ్య, చందనమూడి శివ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.