*సీఎం చంద్రబాబు గారికి స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి*
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామిగా కూటమి తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికారు.
ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ను కలిసి మాట్లాడారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ఇటీవల ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో సీఎం తన ఢిల్లీ పర్యటనను ధ్రువీకరించగా.. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.