*సీఎం ఆదేశించిన సోమశిల ఆప్రాన్ నిర్మాణం పనులు ఆగిపోయాయి : బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్*
మూడు నెలల్లో పూర్తి చేయాల్సిన దెబ్బతిన్న ఆఫ్రాన్ పనులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ సోమశిల ఎస్సీ బివి రమణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిల డ్యామ్ సందర్శించి జూలై చివరి లోగా దెబ్బతిన్న డాం పనులను పూర్తి చేయలని ఆదేశించారు.
ఆ పనులు చేపట్టిన కాంట్రాక్టర్కు 17 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పనులు నిలిపి వేశారు.
జూలై చివరి నుండి రుతుపవనాల ప్రభావంతో డ్యాం నుండి భారీగా *నీటి విడుదల జరుగునున్నందున ఆఫ్రాన్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని* ప్రాజెక్ట్ ఎస్సీ బివి రమణారెడ్డికి మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర బడ్జెట్లో సోమశిల కు స్వల్ప నిధులు కేటాయించారు. డ్యాం గేట్లు రోప్పుల మరమ్మత్తులు తోబాటు సాంకేతిక సిబ్బందిని పలువురిని నియమించాల్సి ఉంది. అందుకుగాను ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి రమేష్ విజ్ఞప్తి చేశారు.