- *సీఎం ఆత్మకూరు పర్యటనను అడ్డుకుంటాం : ఆర్ పి ఐ*
… ………………..,
చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరిచి పర్యటనలు కు రావాలని ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా పత్రికా ప్రకటనల్లో ఆయన మాట్లాడుతూ
చంద్రబాబు గారు గత ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీలు అమలుపరిచి పర్యటన కార్యక్రమాలు జరుపుకోవాలని కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు హామీలు అమలు చేయకుండా పర్యటనలు పేరుతో ప్రజల్లో తిరగడం మీకు మొహం ఎలా చెల్లుతుందని అన్నారు
సూపర్ సిక్స్ పథకం అమలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితమన్నారు ఏ పథకం అమలు కాలేదు అన్నారు. పేదల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం అన్నారు మరి కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు సంక్షేమం కోసం ప్రజాధనాన్ని సహజ వనురులని దోచుకునే పనిలో నిమగ్నమయ్యారని పేదలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో పేద ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఆదాయం పర్సంటేజీలు వచ్చే పనుల్లో ఉన్న శ్రద్ధ పేద దళితులు సమస్యలు వారికి పట్టదన్నారు
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాస్వామ్యంలో పర్యటనలు జరుపుకోవాలని అన్నారు హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్ పి ఐ పార్టీ మీ పర్యటనలు అడ్డుకుంటామన్నారు
ఈ కార్యక్రమంలో దుంపల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు