7.1. 2025.
పొదలకూరు*.
*సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి*. రాజగోపాల్ సిపిఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి.”
పొదలకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో విస్తృత జనరల్ బాడీ సమావేశం పొదలకూరులోని పార్టీ ఆఫీస్ నందు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరు నగరంలో జరుగుచున్న సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేసే పార్టీ సిపిఎం పార్టీ. జిల్లాలోని అనేక సమస్యల మీద రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నాము. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ఉద్యోగుల సమస్యల పైన అనేక పోరాటాలు నిర్వహించాము.. సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలని, దెబ్బతిన్న ఆఫ్రాన్ పనులను వెంటనే మరమ్మత్తులు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ తరుణంలో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో జరుగుచున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన భారీ ర్యాలీ, బహిరంగ సభ జరుగుచున్నది. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. మూడో తేదీ జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరారు. మహాసభల జయప్రదానికై ప్రతి ఒక్కరూ సహకరించి తోడ్పాటు అందించాలని కోరారు. సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. పెంచల నరసయ్య, మండల నాయకులు బి. మనోహర్, రంగయ్య, జి. మనీ, యానాదిరెడ్డి, పాండు, పెంచలయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.