*సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా*

23వ డివిజన్లో గత కొన్ని రోజులుగా మంచినీరు సరిగా రాకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నేత సుధీర్ మాట్లాడుతూ
23 వ డివిజన్ సుందరయ్య నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు రెండు పూటలా మంచినీటిని అందించాలని ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం సిపిఎం నాయకులు సుధీర్, పాటల శీనయ్య , కార్యకర్తలు
నగరపాలక సంస్థ కమిషనర్ కి మరియు నగర మేయర్ కి వినతి పత్రాలు అందజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed