*సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది – ఎంపీ వేమిరెడ్డి*
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వెల్లడించారు.
చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని, గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించిందన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.