నెల్లూరు
30-04-2025

*సింహాచలం ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన సంఘటన దురదృష్టకరం…బాధాకరం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

➖ సింహాచలం ఘటన వివరాలను పాత్రికేయుల సమావేశంలో వివరించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

➖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులు అనుకొని ప్రకృతి వైపరీత్యానికి గురై మృతి చెందడం ఒక దురదృష్టకరమైన సంఘటన… ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన విపత్తు : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

➖ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర హోం మంత్రి అనిత గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హుటాహుటిన ఘటన జరిగిన స్థలానికి పంపడం జరిగింది : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

➖ ఈ తెల్లవారుజామున రెండు గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో భారీ ఈదురు గాలులతో భారీ వర్షం కురవడం జరిగింది : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

➖ కొండలపై నుంచి భారీగా వర్షం నీరు చేరడంతో ప్రహరీ గోడ కింద ఉన్నటువంటి మట్టి అంతా కరిగి కొత్తగా కట్టినటువంటి ప్రహరీ గోడ కూలడం జరిగింది : మంత్రి ఆనం

➖ అనేక ఆలయాలకు కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాదం స్కీం కింద ఆలయాల అభివృద్ధి నిర్మాణం జరుగుతుంది

➖ ఒకవైపు శ్రీశైలం, మరోవైపు కనకదుర్గమ్మ ఆలయం కొన్ని అభివృద్ధి పనులు ప్రసాదం స్కీం కింద పూర్తయ్యాయి

➖ సింహాచలంలో కూడా కొంతమేర ఆలయ అభివృద్ధి పనులు ప్రసాదం స్కీం కింద ప్రారంభమయ్యాయి

➖ అటు పర్యాటక రంగం, ఇటు దేవాదాయ శాఖ పరివేక్షణలో ఈ నిర్మాణ పనులు జరుగుతాయి

➖ సింహాచలంలో జరిగే చందనోత్సవం ప్రభుత్వ పండుగ గుర్తించడం జరిగింది

➖ దేవాదాయ శాఖ మంత్రిగా నేను, రెవిన్యూ శాఖ మంత్రి, హోం మంత్రి, అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు దాదాపు రెండు నెలల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం

➖ ప్రకృతి వైపరీత్యం తో దాదాపు 7 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది..

➖ ఘటనపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించాము

➖ ఘటన జరిగిన తథనంతరం సహాయక చర్యలు ముమ్మరం చేసి దూరప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు స్వామి వారి దర్శనం సజావుగా సాగేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు

➖ ప్రస్తుతానికి దర్శనాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగుతున్నాయి

➖ భక్తుల నుంచి కూడా ఏర్పాట్లపై మంచి స్పందన వస్తుంది. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు అన్ని సజావుగా సాగాయని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

➖ ఈ ఒక్క దురదృష్ట ఘటన మినహా అంతా సజావుగా సాగుతుంది

➖ అనుకోని భారీ వర్షాలతో ఈ పరిస్థితి నెలకొంది

➖ ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

➖ వేకువ జాము నుంచే హోం మంత్రి రెవిన్యూ శాఖ మంత్రి దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు

➖ ఘటనలో మొత్తం 7 మంది చనిపోయారు ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించడం జరిగింది

➖ మిగతా వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు

➖ *సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్*

➖ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపి భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు

➖ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

➖ జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్న సిఎం

*గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సిఎం ఆదేశం: మంత్రి ఆనం*

➖ జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

➖ ప్రకృతి వైపరిత్వంతో జరిగిన ఈ అనుకోని ఘటనతో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం

➖ చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు అయిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులు ఆదేశించడం జరిగింది

➖ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది

➖ గాయాలు పాలైన వారికి మూడు లక్షల రూపాయలు తో పాటు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది..

➖ సింహాచల ఘటనపై తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

➖ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేలు పరిహారం ప్రకటించిన ప్రధాని

➖ *విచారణ పూర్తి చేసి మూడు నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాము*

➖ ఈరోజు రాత్రి 12 గంటలకు దాదాపు 3 లక్షల మంది భక్తులు స్వామివారిని సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసాము… దర్శన ఏర్పాట్లు పట్ల భక్తులు కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

*• బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం…ఆ కుటుంబాలకు అన్ని విధాల అండగా వుంటాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
……………………..

NELLORE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed