సింహపురి యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద అవగాహన సదస్సు:
07 ఆగస్టు 2025
కాకటూరు, నెల్లూరు:
మేరా యువ భారత్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ విజయ గారు యూనివర్సిటీ ప్రిన్సిపల్, వి సురేష్ గారు డి ఐ ఓ, నాగేశ్వరరావు గారు సీఈఓ సెట్నల్, పి.హరికృష్ణ గారు సెంట్రల్ బ్యూరో అఫ్ కమ్యూనికేషన్, డాక్టర్ ఉదయ్ శంకర్ గారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, రవి శంకర్ గారు లీడ్ బ్యాంక్ డిజిటల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్,
డాక్టర్ కె వి సుబ్బారెడ్డి, డాక్టర్ నాగభూషణరావు, డాక్టర్ శంకర్ డాక్టర్ సుచరిత పాల్గొన్నారు
ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు, రవిశంకర్ గారు డిజిటల్ ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ సెక్టార్ లోని పథకాలను వివరించారు,
సురేష్ గారు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంశాలను వివరించారు, నాగేశ్వరరావు గారు యువజన వ్యవహారాల గురించి వివరించారు, హరికృష్ణ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు గురించి వివరించి వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారని జిల్లా యువజన అధికారి ఏ మహేంద్ర రెడ్డి గారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు బహుమతులు ప్రధానం చేశారు మరియు యువత, అధికారుల పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.