సాయినాధుని సన్నిధిలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దంపతులు
– ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ..
రాజకీయంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు.. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బాలకృష్ణ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.. రాజకీయంగా ప్రతి నిర్ణయంలో, ప్రతి అడుగులో తోడుగా ఉంటానని బాలకృష్ణ ఆయనకి భరోసా ఇచ్చారు.. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దంపతులు బాలాజీ నగర్ లోని అద్దాల సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన బాలకృష్ణకు, సిటీ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని కోటంరెడ్డి వెల్లడించారు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు డివిజన్లో టిడిపి నేతలు సేవా కార్యక్రమాలతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. తనపై ఉన్న అభిమానంతో ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కోటంరెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.. సాయినాధుని ఆశీస్సులతో.. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం భాగ్యం తనకు దక్కుతుందని అయన అన్నారు.