*సామాజిక ఆరోగ్య కేంద్రంగా ముత్తుకూరు పి.హెచ్.సీ*
*ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల సమగ్ర అభివద్ధే మా లక్ష్యం*
*ప్రజలు కూడా వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలి*
*ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*రూ.50 లక్షలతో నిర్మించిన అదనపు భవనాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాతతో కలిసి ప్రారంభించిన సోమిరెడ్డి*
*సోమిరెడ్డి కామెంట్స్*
వైద్య సేవల కోసం పేదలు వినియోగించుకునే పి.హెచ్.సీలు, సీ.హెచ్.సీలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం
పొదలకూరులో డయాలసిస్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి..త్వరలోనే మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభిస్తాం
వెంకటాచలం, పొదలకూరు సి.హెచ్.సీలకు త్వరలో జెనరేటర్లు, ఫ్రీజర్లు, వాషింగ్ మెషీన్లు, ఆర్వో ప్లాంట్లు, కంప్యూటర్లు తదితర సామగ్రి అందజేయబోతున్నాం
పి.హెచ్.సీలకు కూడా ఆర్వో ప్లాంట్లు, ఇతర సామగ్రి కలిపి రూ.1.90 కోట్ల విలువైన వస్తువులను త్వరలోనే SEIL(సెంబ్ కార్ప్) కంపెనీ అందజేయబోతోంది
ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్ గ్రేడ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం
మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో సామాజిక ఆరోగ్యై కేంద్రం సేవలను అందుబాటులోకి తేవాలని చూస్తున్నాం
స్థానికంగా ఉండే ప్రజలతో పాటు పారిశ్రామికీకరణ నేపథ్యంలో ఈ ప్రాంతానికి వేలాదిగా ప్రజలు వస్తున్న నేపథ్యంలో ముత్తుకూరులో సీ.హెచ్.సీ తప్పనిసరని భావిస్తున్నాం
ప్రసవాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయించుకునేలా గర్భిణులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలపై ఉంది
ప్రభుత్వ ఆస్పత్రులకు ఏ అవసరం వచ్చినా సమకూర్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం