సాక్షి ఎడిటర్ కు నోటీసులు

.. విచారణకు హాజరు కావాలని పేర్కొన్న పోలీసులు 

నెల్లూరు జిల్లాలో తేదీ 06.10.2025 న ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదముగా మృతి చెందిన ఘటన గురించి కలిగిరి మరియు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదు చేయడం జరిగింది.

సదరు కేసులు గురించి తేది 07.08.2025 మరియు 08.10.2025 లలో సాక్షి పత్రికలో వచ్చిన కథనం మేరకు, కలిగిరి , నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదు కాబడిన కేసులలో సమాచార సేకరణ మరియు విచారణ నిమిత్తం, హైదరాబాద్ లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో గల చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డికి మరియు నెల్లూరు జిల్లా స్టాఫర్ మస్తాన్ రెడ్డికి కలిగిరి CI గారి ఆధ్వర్యంలో కలిగిరి SI గారు మరియు నెల్లూరు రూరల్ పోలీస్ విచారణ అధికారి, BNSS 179 cl (1) 94 సెక్షన్ మేరకు సంబందించిన పత్రములు మరియు వస్తువులు ప్రొడ్యూస్ చేయవలిసిన దిగా మరియు విచారణ, సమాచార సేకరణ నిమిత్తం అందుబాటులో ఉండవలిసినదిగా
నోటీసులు జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed