*సర్వేపల్లి సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం*
*ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం*
*ప్రతి గిరిజన కుటుంబానికి ఫిబ్రవరి నెలాఖరు లోపు ఆధార్ కార్డులు ఇప్పించే బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించాం*
*ముత్తుకూరు మండలం వల్లూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*పశువైద్యశాలతో పాటు సిమెంట్ రోడ్లను ప్రారంభించిన సోమిరెడ్డి*
*సోమిరెడ్డి కామెంట్స్*
తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అండగా నిలుస్తున్న వల్లూరు పంచాయతీ ప్రజలకు రుణపడి ఉంటాను
వల్లూరు పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న అని సమస్యలను పరిష్కరిస్తాను…ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తాను
ఫిబ్రవరి నెలాఖరు లోపు గిరిజనులందరికీ ఆధార్ కార్డులు ఇప్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నాం
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించే బాధ్యతను సచివాలయ ఉద్యోగులతో పాటు అధికారులకు అప్పగించాం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలకు వేలాదిగా అర్జీలు వస్తున్నాయి
ప్రతి సమస్యను నిర్ణీత సమయం లోపు పరిష్కరించేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహించి సూచనలిస్తున్నాం..కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్నారు
నారా లోకేష్ బాబు దావోస్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు
నదుల అనుసంధానంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్య లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు
కృష్ణపట్నంలోని 2600 ఎకరాల రిలయన్స్ భూముల్లోనూ సోలార్ సంబంధిత మూడు పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి
మూడు, నాలుగు నెలల్లో పరిశ్రమలు ప్రారంభించకపోతే అప్పట్లో భూములను త్యాగం చేసిన రైతులు తిరిగి వాటిలోకి ప్రవేశించే పరిస్థితి వస్తుందని అనిల్ అంబానీ ప్రతినిధులకు సూచించాను
త్వరలో వరికోతలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు
ధాన్యంలో వీలైనంత వరకు తేమ లేకుండా ఆరబెట్టి కనీస మద్దతు ధర పొందాలని రైతులను కోరుతున్నాను