*సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పిలుపు మేరకు*
*అంకుపల్లి గిరిజనులకు దుప్పట్లు, నోట్ బుక్స్ పంపిణి*
పొదలకూరు :సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పిలుపు మేరకు పొదలకూరు మండలం అంకుపల్లి గ్రామ గిరిజన కాలనీలో గిరిజనులకు దుప్పట్లు, విద్యార్థులకు పలకలు, పెన్నులను టీడీపీ నాయకులు పంపిణి చేశారు. సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలను పూలబికేలతో శాలువాలతో కాకుండా పేదలకు సహాయం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, రైతు సంఘం నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి,గంటా.మల్లికార్జున్ యాదవ్, పిచ్చినాయుడు ,కలిచేటి శ్రీనివాసులు రెడ్డి ,రాఘవులు, ప్రభాకర్ నాయుడు పేదలకు దుప్పట్లు పంపిణి చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన కాలనీలోని 100 కుటుంబాల పేదలకు దుప్పట్లు పంపిణి చేశామని,రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దుప్పట్లు అందజేశామని రాబోయే రోజుల్లో మరెన్నో మంచి కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.