*”సర్వేపల్లి ప్రజలకు నాన్నపై ఉన్న అభిమానాన్ని ఎవరు ఆపలేరు..” – శ్రీమతి కాకాణి పూజిత*
*వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన సర్వేపల్లి ప్రజలు*
*జగనన్నపై అభిమానం, గోవర్ధన్ రెడ్డి గారిపై నమ్మకంతో భారీగా తరలివచ్చిన ప్రజల అభిమానులను చూసి భావోద్వేగానికి గురైన కాకాణి పూజిత.*
*సర్వేపల్లి రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు ఇసుకవేసిన రాలనంతా జనం*
*SPS నెల్లూరు జిల్లా:*
*సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన “వెన్నుపోటు దినం” నిరసన కార్యక్రమంలో ఎంపి మిథున్ రెడ్డి గారు, గురుమూర్తి గారు, భారీగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలసి ర్యాలీగా వెళ్లి, ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె శ్రీమతి కాకాణి పూజిత గారు*
*కాకాణి పూజిత మాట్లాడుతూ..*
👉 రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో *”వెన్నుపోటు దినం”* నిరసన కార్యక్రమం చేపట్టాం.
👉 ఏడాదిగా ప్రజలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా *”వెన్నుపోటు దినం”* నిరసన కార్యక్రమం నిర్వహించాం.
👉 కూటమి ప్రభుత్వం ఎన్నికలలో అనేక హామీ ఇచ్చి, సంవత్సరం రోజులైనా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుంది.
👉 ప్రజల కోసం పోరాడే వ్యక్తులను టార్గెట్ చేస్తూ, వాళ్ల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది.
👉 ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజల కోసం నిలబడే వ్యక్తులను ఇబ్బందులు గురిచేస్తున్నారు.
👉 భారీగా తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తేనే, కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతుంది.
👉 సర్వేపల్లిలో *”వెన్నుపోటు దినం”* నిరసన కార్యక్రమం సర్వేపల్లిలో మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు లేకుండా నిర్వహించుకోవడం బాధాకరం.
👉 కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర శాంతి భద్రతల కోసం పోరాటం చేశారు.
👉 ప్రజల కోసం పోరాడే వ్యక్తులను అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రజలకు అన్యాయం చేసినట్లే..
👉 గోవర్ధన్ రెడ్డి గారి గళం నొక్కాలని చూస్తే, నేడు వేలాదిమంది తమ గళం విప్పేందుకు ఇక్కడకు తరలివచ్చారు.
👉 కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే, ప్రజల కోసం గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడేవారు కాదు కదా!
👉 ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి.
👉 ఏడాది కాలంగా ప్రజలకు అందించాల్సిన పథకాలను బకాయిలతో సహా అమలు చెయ్యండి.
👉 శాంతియుతంగా ప్రజల కోసం ర్యాలీ నిర్వహిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది.
👉 ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తెలియకుండా చేయాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది.
👉 ఇలాంటి చర్యలను ఆపి, ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాం..
👉 పెద్దలు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, గురుమూర్తి గారు మా కుటుంబానికి అండగా నిలబడటం ధైర్యాన్ని ఇచ్చినట్లుంది.
👉 నాన్న జైల్లో ఉన్నా, జగనన్న పై అభిమానంతో, నాన్న పై నమ్మకంతో వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క సర్వేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నాన్న అభిమానులకు, ప్రజలకు పేరుపేరున ధన్యవాదాలు
*యం.పి.మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ..*
👉 కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం అవుతున్న ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ ను నెరవేర్చలేదు
👉 కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించాలని *”వెన్నుపోటు దినం”* నిరసన కార్యక్రమం చేపట్టాం.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి, జైళ్లకు పంపుతున్నారు.
👉 పరిపాలనను గాలికి వదిలేసి వేధింపులు అక్రమ కేసులు పెడుతూ, కూటమి ప్రభుత్వం బిజీబిజీగా ఉంది.
👉 కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపినా, గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు అండగా నిలబడటం అభినందనీయం.
👉 జగన్మోహన్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు నెల్లూరు రానున్నారు..
👉 ప్రజలకు మేలు జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతున్నా..
*యం.పి.గురుమూర్తి మాట్లాడుతూ..*
👉 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నీకు 15 వేలు, నీకు 18వేలు.. అంటూ ప్రజలను మభ్యపెట్టింది.
👉 కూటమి రోజున ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది.
👉 ప్రజల కోసం గళం వినిపించే, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి, ఆయన గళం నొక్కాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది.
👉 న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది..
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా నిలబడుతుంది.
👉 కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేయని ప్రతి పథకాన్ని ప్రజలకు అందించాలి
👉 జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి..
👉 కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు పథకాలను అందించారు.
👉 వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, కూటమి ప్రభుత్వంపై తమ నిరసన గళం వినిపిస్తున్నారు.