*”సర్వేపల్లి ని సోమిరెడ్డి నిలువు దోపిడి”* : *మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి*

*వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామం, నాగంబుట్లవారి కండ్రికలో వందలాది ఎకరాలలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ త్రవ్వి, తరలిస్తూ, కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సోమిరెడ్డి.*

– *వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిలో వేలాది ట్రిప్పులు గ్రావెల్ తరలిస్తున్నా, ఏమాత్రం పట్టించుకోని మైనింగ్ అధికారులు.*

– *ప్రభుత్వ భూములలో సోమిరెడ్డి విచ్చలవిడిగా గ్రావెల్ త్రవ్వేస్తున్నా, చోద్యం చూస్తూ మిన్నకుండిపోయిన రెవిన్యూ అధికారులు.*

– *మామూళ్ల మత్తులో పడి, పట్టించుకోని పోలీసు శాఖ.*

– *భారీ శబ్దాలతో అక్రమ గ్రావెల్ మైనింగ్ జరపడంతో పెద్ద పెద్ద శబ్దాలతో ఇబ్బంది పడుతున్నామన్న నాగంబుట్లవారి కండ్రిక గ్రామస్తులను బెదిరిస్తున్న సోమిరెడ్డి మాఫియా.*

– *ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న గ్రావెల్ దందాను చూసి సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకులతోపాటు, మైనింగ్, రెవిన్యూ అధికారులకు కూడా జైలు శిక్ష తప్పదంటున్నా సర్వేపల్లి ప్రజలు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *