నెల్లూరు: మార్చి 26
సర్వేపల్లి నియోజకవర్గంలో 72 మందికి రూ.92. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన
ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
సర్వేపల్లి నియోజకవర్గంలో వైద్య చికిత్సలు చేయించుకున్న 72 మందికి సి ఎం.రిలీఫ్ ఫండ్ క్రింద రూ.92,25,517 లను ఆర్థిక సహాయాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నెల్లూరు లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో 72 మందికి చెక్కులు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సర్వేపల్లి నియోజకవర్గం లో ఇప్పటివరకు 131 మందికి 1 కోటి 60 లక్షల 52 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలను వివిధ ఆసుపత్రుల్లో చేయించుకున్న పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేయించామని తెలిపారు ఇంత పెద్ద మొత్తంలో గత ప్రభుత్వంలో ఎప్పుడూ సహాయం అందించలేదని ఆయన చెప్పారు సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
సోమిరెడ్డి జన్మ దినం సందర్భంగా పలువురు నాయకులు ,అధికారులు శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ చేసారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం నెల్లూరు