*సర్వేపల్లిలో ఐదేళ్ల తర్వాత మళ్లీ అభివృద్ధి జాతర*

*రూ.10 కోట్లతో 130కి పైగా పనులతో ఇరిగేషన్ వ్యవస్థకు కొత్తరూపు*

*పల్లెల్లో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి రూ.2.80 కోట్ల ఏఎంసీ నిధులతో అంచనాలు*

*రూ12 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం*

*గిరిజనుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి*

*రైతుల డేగపూడి – బండేపల్లి కాలువ సాకారం చేసే బాధ్యత నాది*

*మనుబోలు మండలం వడ్లపూడి పంచాయతీలో రూ.20 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సోమిరెడ్డికి ఘనస్వాగతం పలికిన వడ్లపూడి పంచాయతీ ప్రజలు*

వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నింటిని బ్రష్టు పట్టించి అభివృద్ధి అనే మాట లేకుండా చేశారు

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థలన్నింటిని గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉంది

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడంతో పాటు పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం

వడ్లపూడిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు ఇచ్చాం

ఇరిగేషన్ శాఖకు సంబంధించి వడ్లపూడి సాగునీటి సంఘం పరిధిలో రూ.63 లక్షలతో ఏడు పనులను రైతుల భాగస్వామ్యంతో చేయించాం

మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్న వడ్లపూడి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ప్రజల అవసరాల మేరకు మెటల్ రోడ్ల నిర్మాణం చేపడతాం

వడ్లపూడిలో సచివాలయం ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం

ఇక్కడ కూడా గిరిజనులు ప్రభుత్వ పథకాలను పొందే విషయంలో అన్యాయానికి గురవుతున్నారు

గిరిజనులకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం

సచివాలయ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేసి ఉద్యోగులందరూ ప్రజల కోసం పనిచేసేలా ప్రయత్నాలను మా ప్రభుత్వం చేపట్టింది

సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.10 కోట్లతో 130కి పైగా పనులు చేపట్టి ఇరిగేషన్ వ్యవస్థకు కొత్త రూపు తెచ్చాం

ఏఎంసీ నిధులు రూ.2.80 కోట్లతో పల్లెల్లో గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం

పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేయించాం

ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అగమ్యగోచరంగా మారిన డేగపూడి –బండేపల్లి కాలువ పనులను పూర్తి చేయించే బాధ్యతను కూడా తీసుకున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *