
*సర్వేపల్లిలో అభివృద్ధి జాతర*
*గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి*
*ముత్తుకూరు మండలం పైనాపురంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*దేవరదిబ్బ గిరిజన కాలనీలో రూ.15 లక్షలతో తాగునీటి సంపు నిర్మాణం..ఇంటింటికీ కుళాయి కనెక్షన్*
*చిన్న సంఘం గిరిజన కాలనీలో రూ.10.50 లక్షలతో ఆర్వో ప్లాంటు, డ్రైనేజీ కాలువపై శ్లాబు నిర్మాణం*
*వాగర్త ఎస్సీ కాలనీలో రూ.12.70 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం*
*దిబ్బమీద ఎస్సీ కాలనీలో రూ.14 లక్షలతో ఇంటింటికీ తాగునీటి కుళాయి..పైపు లైను ఎక్స్ టెన్షన్*
*రూ.30 లక్షలతో పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన*
*SEIL కంపెనీ సీఎస్ఆర్ నిధులు రూ.66 లక్షలతో నిర్మించిన రెండు మెగా వాటర్ ప్లాంట్లకు ప్రారంభోత్సవం*
*SEIL ఆధ్వర్యంలోనే రూ.52 లక్షలతో 210 సోలార్ లైట్ల ఏర్పాటు*
*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో అభివృద్ధి జోరందుకుంది
అదే క్రమంలో ఈ రోజు పైనాపురం పంచాయతీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం
దేవరదిబ్బ గిరిజన కాలనీ వాసులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు
గిరిజనుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం
SEIL ఏర్పాటు చేసిన వ్యానులో గిరిజన బిడ్డలు స్కూలుకు వెళుతుండటం సంతోషంగా ఉంది
మనతో సమానంగా భూమిపై అడుగుపెట్టిన గిరిజనులు ఇంకా పేదరికంతో దుర్భర పరిస్థితిలో ఉండటం బాధాకరం
నా వంతుగా నేను వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను..SEILతో పాటు పామాయిల్ కంపెనీలను కోరి గిరిజన కాలనీలను దత్తత తీసుకునేలా కృషి చేశాను
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం
పైనాపురం, వరకవిపూడి, ముసునూరువారిపాళెం పంచాయతీల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు SEIL ముందుకు రావడం అభినందనీయం
గత ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది
ప్రస్తుతం నేలటూరు ప్రధాన గ్రామానికి సంబంధించిన ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది
నేలటూరుపాళెంకు సంబంధించి ఇంకా పునాదుల స్థాయిలోనే ఉంది
ఎస్సీ కాలనీతో పాటు దేవరదిబ్బ గిరిజన కాలనీలకు సంబంధించి స్థల సేకరణ జరపాల్సివుంది
మా ప్రభుత్వ హయాంలోనే ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం