it

*సర్వేపల్లిని అభివృద్ధి చేసిన నాకు ప్రజలను ఓట్లు వేయమని ధైర్యంగా అడిగే హక్కు ఉంది : మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*గ్రావెల్ కోసం కొండలు లేపేయడంతో పాటు ఊళ్ల చుట్టూ బావులు తలపించేలా గోతులు తీసిన కాకాణి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడు*

*కాకాణి మైనింగ్ మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోయిందనేందుకు ఈదగాలి పంచాయతీ శ్రీకాంత్ కాలనీలో పేదల ఇళ్ల చుట్టూ తవ్విన గ్రావెల్ గుంతలే ప్రత్యక్ష నిదర్శనం*

*ఒక్కో పేద కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే ఈదగాలిలో కాకాణి ఓట్లు అడగాలి*

*వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయతీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సోదరి సంయుక్తమ్మ, కుమార్తె డాక్టర్ సింధుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ఈదగాలి వాసులు*

*ఈదగాలి శ్రీకాంత్ కాలనీ వద్ద ప్రమాదభరితంగా ఉన్న గ్రావెల్ గుంతలను పరిశీలించిన సోమిరెడ్డి*

*సోమిరెడ్డి కామెంట్స్*

మా పెద్ద అక్క సంయుక్తమ్మ ఈదగాలికి కోడలిగా వచ్చినప్పటి నుంచి నాకు ఈ ఊరితో ప్రత్యేక అనుబంధం ఉంది

1994లో నేను మొదటి సారి ఎమ్మెల్యే అయ్యే నాటికి ఈదగాలికి తారురోడ్డు లేదు, మంచి నీటి పథకాలు లేవు..వీధిలైట్లు కూడా లేని దుస్థితి

చుట్టూ కర్రతుమ్మ చెట్లు, మధ్యలో ఊరు. పొలాల్లోకి వెళ్లేందుకు కూడా దారులు లేవు

కండ్రిగ వాసులైతే ఎండాకాలంలో 2, 3 కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి

అలాంటి పరిస్థితుల్లో ఈదగాలిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నిధులు తెచ్చి నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించాను

టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.6 కోట్లతో సిమెంట్ రోడ్లు వేయించి ఊరికి కొత్త రూపు తెచ్చాను

రూ.1.28 కోట్లతో ఇరిగేషన్ వ్యవస్థను సమూలంగా ఆధునికీకరించాం

100 శాతం ఇళ్లకు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయడంతో పాటు 372 ఎల్ఈడీ వీధి దీపాలు వేయించాం

49.50 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములను డీకేటీ పట్టాలుగా మార్చడం ద్వారా 50 మంది పేద రైతులకు ప్రయోజనాలు కలిగించాం

పొలాల్లో లింకు రోడ్లు, డొంక రోడ్లు వేయించి రైతుల కష్టాలు తీర్చాం

సర్వేపల్లి నుంచి ఇడిమేపల్లి, ఈదగాలి మీదుగా పూడిపర్తి వరకు తారు రోడ్డు వేయించా

ఇన్ని పనులు చేసిన నాకు ప్రజలను ఓటు వేయమని ధైర్యంగా అడిగే హక్కు ఉంది

కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం చేతిలోకి తీసుకున్న తర్వాత ఈదగాలి చుట్టూ గ్రావెల్ సంపద మాయమైపోతోంది

గిరిజన బిడ్డలుండే శ్రీకాంత్ కాలనీ చుట్టూ వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వి కాకాణి అండ్ బ్యాచ్ కోట్లాది రూపాయలు దోచేస్తోంది

గ్రావెల్ తవ్వకాల ద్వారా దోచేస్తున్న వందల కోట్లలో పేద కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల చొప్పున ఇస్తే కాకాణిది ఏం పోతుంది

పేదల ఇళ్లు చుట్టూ 30 అడుగుల లోతులో గ్రావెల్ గుంతలు తవ్వి మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి తెచ్చారు

శ్రీకాంత్ కాలనీ వాసులకు మేము రోడ్లు వేయించి, కాలనీ ఇళ్లు కట్టిస్తే ఈ రోజు ఇక్కడి గిరిజన బిడ్డలను చెరువులో చేపలు పట్టుకునేందుకు అనుమతించడం లేదు.

నిత్యం కోట్ల రూపాయల సంపాదనే ధ్యాసగా బతికే కాకాణి గోవర్ధన్ రెడ్డికి పేదలంటే అర్థం తెలుసా

పేదల కాలనీలు, ఇళ్ల పేరుతోనూ కోట్లు దోచేసుకుంటున్నాడు

*ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈదగాలి చుట్టూ ఎన్ని ఎకరాల్లో గ్రావెల్ ఎత్తేశారు. ఎన్ని కోట్లు సంపాదించారో లెక్కలు చెప్పి పేదలకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఈ ఊళ్లో కాకాణి ఓట్లు అడగాలి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed