_*సర్దార్@150: అక్టోబర్ 31న వి ఎస్‌ యూ ‘యూనిటీ మార్చ్ ”ఏక్ భారత్ – ఆత్మనిర్భర్ భారత్’ పోస్టర్లను ఆవిష్కరించిన వీసీ ఆచార్య శ్రీనివాసరావు…*_

విక్రమ సింహపురి యూనివర్సిటీలో
సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి (“సర్దార్@150”) ఉత్సవాలను పురస్కరించుకుని, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU), నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సమైక్య పాదయాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో “ఏక్ భారత్ – ఆత్మనిర్భర్ భారత్” సమైక్య పాదయాత్ర గోడపత్రాలను (పోస్టర్లను) వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వీసీ ఆచార్య శ్రీనివాసరావు మాట్లాడుతూ, “ఏక్ భారత్ – ఆత్మనిర్భర్ భారత్” స్లోగన్‌తో, “వాక్ ఫర్ యూనిటీ, వాక్ ఫర్ భారత్!” అనే పిలుపుతో ఈ జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్దార్ వల్లభభాయి పటేల్ దార్శనికతను స్మరించుకుంటూ, ‘ఒక దేశం, ఒకే దృక్పథం’ (One Nation, One Vision) అనే భావనను ప్రతిబింబించేలా ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ సమైక్య పాదయాత్ర అక్టోబర్ 31, 2025 (శుక్రవారం) ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు నెల్లూరులోని వీఆర్‌సి గ్రౌండ్ నుండి వేదాయపాలెం వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు, మరియు నగర పౌరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కే సునీత, కోవూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న గారు,జిల్లా యువజన అధికారి శ్రీ మహేందర్ రెడ్డి గారు, ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, ఆచార్య అందే. ప్రసాద్, ఆచార్య సుజాస్ నాయర్ డాక్టర్ ఎస్ బి. సాయినాథ్ , డాక్టర్ వై. విజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed