*సమాజాన్ని బాగు చేయాలన్నదే వేమిరెడ్డి దంపతుల లక్ష్యం – చంద్రబాబు*
– ప్రజాసేవ కోసమే వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారు.
– డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు.
– ప్రసన్నకుమర్‌రెడ్డి అనే వైరస్‌కు ప్రశాంతిరెడ్డి వ్యాక్సిన్
– అక్రమాలు, అవినీతి తప్ప కోవూరులో ఇంకేం లేవు – విపిఆర్
– చంద్రబాబుగారితోనే యువతకు ఉద్యోగాలు
– ఈ నియోజకవర్గంలో మార్పు రావాలి – ప్రశాంతిరెడ్డి
– ప్రజలు ఈ ప్రభుత్వానికి బైబై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి – ప్రశాంతిరెడ్డి
సమాజాన్ని బాగు చేయాలన్న లక్ష్యం ఎంతో ఉన్నతమైందని, ఆ లక్ష్యంతో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, ప్రశాంతిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. డబ్బు సంపాదించడానికి వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని ప్రశంసించారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాసేవ వేమిరెడ్డి దంపతుల లక్ష్యమని అన్నారు. ప్రజలందరూ కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిగారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారిని గెలిపించాలని కోరారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే వేమిరెడ్డి దంపతుల గెలుపు ఖాయమయ్యిందన్నారు. ప్రసన్నను కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించింది తానేనని, ఇప్పుడు ఆయనే ఈ నియోజకవర్గానికి శనిలా తయారయ్యారన్నారు. ఆ శనికి మెడిసిన్ ప్రశాంతిరెడ్డి గారి గెలుపని అన్నారు. రాజకీయాలంటే దోపిడీ, అవినీతి అనేది సీఎం జగన్, ప్రసన్నకుమార్‌రెడ్డి స్వభావమని అన్నారు. కానీ రాజకీయాలు అంటే ప్రజాసేవ, మంచి చేయాలి అనేది వేమిరెడ్డి గారి కుటుంబ స్వభావమన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు మహిళపై కూడా దారుణంగా విమర్శలు చేశారని, వాటిని కూడా తట్టుకుని ధైర్యంగా పోరాడుతున్నారని ప్రశాంతిరెడ్డి గారిని అభినందించారు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన అక్రమాలను, అన్యాయాలకు ఎండగట్టారు. మద్యం దగ్గర నుంచి ఇసుక వరకు చేసిన అక్రమాలపై ప్రశ్నలు సంధించారు.
అంతకుముందు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మాట్లాడుతూ… కోవూరు నియోజకవర్గాన్ని ప్రసన్నకుమార్‌రెడ్డి అవినీతిమయంగా మార్చేసారని ఆరోపించారు. కోవూరు నియోజకవర్గం ఇసుక గ్రావెల్ మాఫియాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తిపడి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పరిహారం అందివ్వకుండా జాప్యం చేస్తూ రైతుల ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి ప్రసన్నే కారణమని దుయ్యబట్టారు. విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డ విజసాయిరెడ్డి ప్రసన్నతో కలిసి ఇఫ్కో భూములు, షుగర్ ఫ్యాక్టరీ భూములు స్వాహా చేసేందుకు నెల్లూరు వచ్చాడని వైసీపీ నేతల కుయుక్తుల గుత్తురట్టు చేశారు. ప్రసన్నకు ఇవే చివరి ఎన్నికలు కావాలని, రానున్న ఎన్నిక్లలో తెలుగుదేశం అభ్యర్దిగా తనను గెలిపించి ప్రసన్నను సాగనంపాలని కోరారు. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నాడన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. ఆరు సార్లు గెలిచానని గొప్పలు చెప్పుకుంటున్న ప్రసన్న నాలుగు పర్యాయాలు గెలిచింది టిడిపిలొంచేనన్న విషయం విస్మరించందన్నారు. మమ్మల్ని వెన్నుపోటు అంటున్న ప్రసన్నకుమార్‌రెడ్డి… టిడిపికి వెన్నుపోటు పొడిచి సిగ్గు లేకుండా వైసీపీలో కొనసాగుతున్నాడని విరుచుకుపడ్డారు. సంక్షేమం అభివృద్ధి సమపాళ్ళలో జరగాలంటే మనమందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చాక ఇఫ్కో సెజ్ లో పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి అవకాశలు కల్పించాలని శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కోరారు. సైకిల్ గుర్తుపై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా తనను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు మాట్లాడుతూ…. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఇంకేం కనిపించడం లేదని అన్నారు. ఈ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రసన్నకుమార్‌రెడ్డి పాలన సాగించాలని దుయ్యబట్టారు. అవినీతిరహిత పాలన అందించేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడుగారిని సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని, ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.