*నెల్లూరు, 16 – 01 – 2025*
సభ్యత్వాలలో కోటి మైలు రాయి దాటి టీడీపీ చరిత్ర సృష్టించింది.
మొదటి రెండు స్థానాల్లో నెల్లూరు నగరం, ఆత్మకూరు లు ఉండటం సంతోషం.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.
సభ్యత్వాలలో కోటి మైలురాయి దాటి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించిందని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కోటి దాటడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 1 కోటికి పైగా ప్రజలు పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని టీడీపీ పట్ల వారికి ఉన్న విశ్వసనీయత, విధేయతను చూపారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రెండు స్థానాల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు నగరం, ఆత్మకూరు నియోజకవర్గాలు ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టిడిపి సభ్యత్వ నమోదు 19 వ తేదీ వరకు చేసుకోవచ్చని, ఇంకా ఎవరైనా సభ్యత్వ నమోదు చేసుకోకపోతే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.