*సపోర్ట్ సోమిరెడ్డి..సేవ్ సర్వేపల్లి….ఇదే ఊరూవాడా మార్మోగుతున్న నినాదం*
*సర్వేపల్లి ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో భారీ విజయం వైపు దూసుకెళుతున్న సోమిరెడ్డి*
*కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం, పొదలకూరులో మెగా వాటర్ ప్లాంటు, పొదలకూరు మండలానికి సోమశిల జలాలు, అత్యాధునిక వసతులతో ప్రభుత్వ ఆస్పత్రులు, డేగపూడి – బండేపల్లి కాలువకు నిధులు (టీడీపీ హయాంలోనే 25 శాతం పనుల పూర్తి), ముత్తుకూరు మండలంలో మత్స్యకారేతర ప్యాకేజీ కుటుంబానికి రూ.43,500 వంతున మంజూరు, చెరువుల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంకు, జైకా నిధులు, మనుబోలు రైతులకు కండలేరు జలాల్లో అదనపు కేటాయింపులు. రూర్బన్ పథకంతో వెంకటాచలం మండలంలోని గ్రామాల్లో సకల వసతుల కల్పన, దశాబ్దాలుగా రహదారుల సౌకర్యానికి నోచుకోని గ్రామాలకు రోడ్ల నిర్మాణం, ఆక్వా రైతులకు రూ.2కే విద్యుత్, ఉచితంగా ట్రాన్స్ ఫార్మర్లు ఇలా…ఎన్నో పనులు చేసిన సోమిరెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించడం మా బాధ్యత అంటున్న సర్వేపల్లి ప్రజలు*
*వైసీపీ ఐదేళ్ల పాలనలో చెప్పుకో దగిన పని ఒక్కటి కూడా చేయకపోగా నియోజకవర్గాన్ని అక్రమ మైనింగ్ , భూకుంభకోణాలకు అడ్డాగా మార్చారని, ప్రైవేటు టోల్ గేట్ తెరిచి వేలాది మందికి ఉపాధినిచ్చే కంటైనర్ టెర్మినల్ ను పొరుగు రాష్ట్రాలకు తరిమేశాడని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం*
*ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెరిగిన చేరికల జోరు*
*వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీకి చెందిన 27 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*
*నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*టీడీపీలో చేరిన వారిలో ఎ.శివకృష్ణ, నలగర్ల వెంకటసుబ్బయ్య, తిరుమలశెట్టి ప్రకాశం, తిరుమలశెట్టి శీనయ్య, నలగర్ల వెంకటరమణయ్య, జంగా నారాయణ, బైనా మురళి, అద్దూరి వెంకటేశ్వర్లు, అద్దూరి శీనయ్య, ఈదూరు సంజీవులు, సర్వేపల్లి మల్లి తదితరులు*