*సజ్జాపురంలో టీడీపీకి భారీ షాక్*
*తెలుగుదేశం పార్టీకి 10 కుటుంబాలు రాజీనామా*
*గ్రామీణ ప్రాంతాలలోప్రజా విశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ*
*ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొలది గణనీయంగా పెరుగుతున్న వైసీపీ గ్రాఫ్*
*పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి హంసకుమారెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక*
నెల్లూరు రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొలది *గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పోయింది*. సజ్జపురం గ్రామంలో ఇప్పటివరకు తెలుగుదేశంపార్టీలో కీలకంగా వ్యవహరించిన పది కుటుంబాల వారు ఆ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దత్తు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీని వీడిన 10 కుటుంబాలు వారు 12వ డివిజన్లోని చింతరెడ్డిపాలెంలో జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి తదితరుల సమక్షంలో స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందించి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో వారందరికీ అన్నివిధాల సంపూర్ణ సహాయ సహకారాలు నుంచి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. సజ్జాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గుంజి పోలయ్య, గుంజి శ్రీహరి, గుంజి రమేష్, గుంజి వెంకటేశ్వర్లు, గురునాథం శీనయ్య, గురునాథం అనిల్, గురునాథం ప్రసాద్, గురునాథ వెంకటేశ్వర్లు తదితరులతోపాటు వారి మిత్రబృందం సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి, మండల జెసిఎస్ అధ్యక్షులు చేరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి హరిశివారెడ్డి, వేమిరెడ్డి హరికృష్ణ రెడ్డి, సజ్జాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.