
*సచివాలయాల ఆకస్మిక తనిఖీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*మొదటగా వెంకటాచలం మండలం సర్వేపల్లిలోని గ్రామ సచివాలయం తనిఖీ*
*ఉద్యోగుల్లో కొందరు మాత్రమే ఉండటం, అటెండెన్స్ రిజిస్టర్ లోనూ ఏఎన్ఎం తప్పి మిగిలిన వారెవరూ సంతకాలు చేయకపోవడంపై అసహనం*
*సచివాలయ వ్యవస్థ వచ్చి ఐదేళ్లవుతుంటే 11 మంది ఉద్యోగులు ఉండి కూడా గిరిజనులకు కనీసం ఆధార్ కార్డు ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్న*
*ఆధార్ కార్డులు లేకపోవడంతో పేదలు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన*
*విధినిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచన*
*ఇకపై సచివాలయాల ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని హితవు*
*పేదల కోసం పనిచేసే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక*
*సచివాలయ ఉద్యోగుల పనితీరుపై జిల్లా ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన సోమిరెడ్డి*
*అనంతరం ఇస్కపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన*
*శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తామని హామీ*
*SEIL(సెంబ్ కార్ప్) కంపెనీ సీఎస్ఆర్ నిధులతో త్వరలోనే పి.హెచ్.సీలకు ఆర్వో వాటర్ ప్లాంట్లు, వాటర్ డిస్పెన్సరీలు, ఇతర పరికరాలు అందజేయనున్నట్లు వెల్లడి*