*సచివాలయంలోని అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్, ఆన్లైన్ అటెండెన్స్ పలు రికార్డులను తనిఖీ చేసిన నగర కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ గురువారం స్థానిక 35/1 రాజీవ్ గృహకల్ప సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సచివాలయంలోని అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్, ఆన్లైన్ అటెండెన్స్ పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కార్యదర్శి ఎంక్వయిరీ లేదా ఫీల్డ్ విజిట్ రెండు సందర్భంలో మూమెంట్ రిజిస్టర్ నందు తప్పకుండా నమోదు చేయాలని, నిర్దేశించిన సమయంలో అటెండెన్స్ నమోదు చేసుకోవాలని, క్రమం తప్పకుండా ఫీల్డ్ విజిట్ నిర్వహించాలని, పనివేళల యందు ప్రజలకు కార్యదర్శులు అందరూ సచివాలయాల యందు అందుబాటులో ఉండాలని, ప్రతి రోజు మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

కమిషనర్ ఆదేశాలమేరకు నగరపాలక సంస్థ సెక్రటరీ శ్రీలక్ష్మి బషీర్ నగర్, సంజయ్ గాంధీ నగర్, వెంగళరావు నగర్ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సిటీ ప్లానర్ హిమబిందు 20/1 టైలర్స్ కాలనీ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నగరపాలక సంస్థలోని పలు అధికారులు కమీషనర్ ఆదేశాలమేరకు వివిధ సచివాలయాలను ఆకస్మి కంగా తనిఖీ చేసి కార్యదర్శులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *