సంయుక్త ప్రాంతీయ కేంద్రం సి ఆర్ సి నెల్లూరు నందు తొమ్మిదవ వార్షికోత్సవ ( 03.01.2025) ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే
ఈరోజు సంయుక్త ప్రాంతీయ కేంద్రం సి ఆర్ సి నెల్లూరు నందు తొమ్మిదవ వార్షికోత్సవ ( 03.01.2025) ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శ్రీ గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ముఖ్యఅతిథిగా శ్రీ శ్రీనివాస రావు ప్లాంట్ హెడ్ జిందాల్ పవర్ లిమిటెడ్ సింహపురి యూనిట్, అతిథులుగా శ్రీ వెంకటసుబ్బయ్య అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్ఎస్ఎ నెల్లూరు, శ్రీ సిద్ధ నాయక్ మెడికల్ సూపర్డెంట్, శ్రీ స్వప్న శ్రీ హెచ్వోడి డ్రీం ఫౌండేషన్, శ్రీ మస్తాన్ వైస్ ప్రిన్సిపల్ ఏ ఎస్ ఆర్ మెడికల్ కాలేజ్ మరియు శ్రీమతి శిరీష కేర్ ఇండియా కోఆర్డినేటర్ విచ్చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా సంయుక్త ప్రాంతీయ కేంద్రం నెల్లూరు డైరెక్టర్ శ్రీ మనోజ్ కుమార్ ఎస్పీ దివ్యాంగుల పిల్లలకు కావలసిన పునరావస్తు చికిత్సలు మాత్రమే కాకుండా వారిని క్రీడల్లో తో పాటు కల్చరల్ ఆక్టివిటీస్ లో వారిని ప్రోత్సహించాలని అలాగే సిఆర్సి నెల్లూరు మండల్ లెవెల్ అవేర్నెస్ క్యాంప్ 32 మండలాల్లో కండక్ట్ చేస్తున్నామని, టెలికాన్ ఫ్రెండ్స్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోస్ మరియు జెడ్పి సీఈఓ గారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది రియాబిటేషన్ సర్వీసెస్ ఓరియంటేషన్ గురించి, సింహపురి యూనివర్సిటీ వారితో ఎంఓయూ చేసుకున్నామని క్యూర్ ఇండియా వారితో ఎంఓయూ చేసుకున్నామని దివ్యాంగుల పిల్లలకి ఉద్యోగ పోటీ పరీక్షల్లో భాగంగా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామని అలాగే రెండు మొహంలాన్ని అడాప్షన్ చేసుకున్నామని మా యొక్క సర్వీసులు ఇంకా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా మేము మా యొక్క సేవల్ని కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది విశిష్ట అతిథి అయినటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 9th ఆనివర్సరీ లో భాగంగా సిఆర్సి నెల్లూరులో ఈరోజు గత నెల డిసెంబర్ జరిగిన 19 20 తేదీల్లో జరిగిన పారా ఒలంపిక్ స్పోర్ట్స్ విజేతలకి బహుమతుల ప్రధానం ఇవ్వడం అనేది చాలా సంతోషం కలిగిందని అలాగే ఈ యొక్క కేంద్రం ఇక్కడ ఏర్పడింది అనడానికి కారణం పెద్దాయన మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ M.వెంకయ్య నాయుడు గారిని వారి యొక్క దూరదృష్టి మరియు విలక్షణ ఆలోచన శైలి వల్లనే ఈ యొక్క మండలంలో ఐదు సెంటర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని సిఆర్సి లో ఉన్నటువంటి ప్రొఫెషనల్ వల్ల మన ప్రాంతపు దివ్యాంగులు అనేకమైనటువంటి రిహబిలిటేషన్ సర్వీసెస్ పొందగలుగుతున్నారని వారి యొక్క సేవలకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన విజేతలకు బహుమతులు మరియు ఈ యొక్క ఒలంపిక్స్ క్రీడలను నిర్వహించినటువంటి జిందాల్ ప్లాంట్ వారిని ఆయన అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి ఎమ్మెల్యే క్యూర్ ఇండియా వారి సర్వీస్ సెంటర్ ను సి ఆర్ సి లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది.
అలాగే ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ శ్రీనివాసరావు హెచ్ఓపి జిందాల్ పవర్ లిమిటెడ్ సింహపురి యూనిట్ గారు మాట్లాడుతూ సి ఆర్ సి కి సంబంధించిన మరియు దివ్యంగులకు సంబంధించినటువంటి సేవలకు మా యొక్క ప్రోత్సాహం మద్దతు అన్నివేళలా ఉంటాయని ఇకముందు కూడా మేము పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాల్లో సి ఆర్ సి తో కలిసి పని చేస్తామని ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం నాకెంతో సంతోషం కలిగించిందని తెలియజేయడం జరిగింది.
అతిథి అయినటువంటి శ్రీ వెంకటసుబ్బయ్య అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి మాట్లాడుతూ భవిత సెంటర్ల ద్వారా ఎస్ఎస్సి ద్వారా దివ్యాంగుల పిల్లలకు అనేకమైనటువంటి రిహబిటేషన్ సేవలు అందివగలుగుతున్నామని మునుముందు మేము కూడా సి ఆర్ సి తో కలిసి కార్యక్రమాల్లో పంచుకొని దివ్యాంగుల్లో నూతన ఉత్సాహం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సిఆర్సి యొక్క సిబ్బంది, బెనిఫిషరీస్, తల్లిదండ్రులు, ఎస్ఎస్సి మరియు ఇతర ఎన్జీవోస్ నుంచి పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది