*సంక్షేమ ప్రదాతకు అండగా నిలవండి*
*.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి*
*సర్వేపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అందులో భాగంగా తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ఈ సందర్భంగా వందలాదిమంది ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా పేదల సంక్షేమం కోసం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలను మంత్రి కాకాని గుర్తు చేశారు. సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే వైసిపిని మరోసారి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే భారీ మెజారిటీ సాధించే దిశగా దూసుకుపోతోంది*