
*శ్రీ శైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కోవూరు శాసన సభ్యురాలు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు శ్రీశైల భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు.
మంగళవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్న ఆమె.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీసులు అందుకున్నారు.
బంగారు రథానికి పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించారు. ఈ
కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టిడిపి నాయకులు అడపాల శ్రీధర్ రెడ్డి మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.