*శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ అమ్మ కరుణామయి విజయేశ్వరీదేవి*
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నకు శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం పెంచలకోన శ్రీ అమ్మ కరుణామయి విజయేశ్వరీదేవి గారు విచ్చేసి స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా ఆలయ అర్చకులు , అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం స్వామి వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు ఆలయ చరిత్రను వివరించి తీర్ధ ప్రసాదములు మరియు శేషవస్త్రం అందచేశారు.
అదేవిధంగా వారితో విచ్చేసిన విదేశి శిష్య బృందం నకు ఆలయ చరిత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆంగ్లం లో వివరించారు .అనంతరం ఆలయంలో శ్రీ అమ్మ కరుణామయి విజయేశ్వరీదేవి గారు భక్తులకు మోక్షం మరియు మోక్ష మార్గం గురించి ఉపదేశం చేసి నారాయణ మంత్రం , మహాలక్ష్మి అమ్మవారి మంత్రం , నారసింహ మంత్రం లను భక్తులతో పలికించారు.
పై కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి, ఆశ్రమం డైరెక్టర్లు విజయ్ భరత్ , విజయ్ గోకుల్ , మేనేజర్ శేషయ్య , ప్రధాన అర్చకులు శ్రీ భాస్కరాచార్యులు ,అర్చకులు శ్రీ కృష్ణమాచార్యులు ,శ్రీ మురళీధరా చార్యులు , శ్రీ రాఘవాచార్యులు, శ్రీ అప్పలాచార్యులు , మరియు వేదగిరి క్షేత్రం ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.