
*శ్రీహరికోటలో మూడో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్*
మూడో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు రూ.3,984.86 కోట్లు
2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగాములు.
మూడో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు: భాజపా నేతలు సంతోషం
శ్రీహరికోటలో మూడో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం అత్యున్నత స్థాయికి చేరుకుందనీ. మూడో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుతో, భారత్ అంతరిక్ష రంగంలో మరింత శక్తిని పొందనుంది. ఇది దేశం కోసం గర్వకారణం,” అన్నారు.మానవ సహిత అంతరిక్ష మిషన్ల సామర్థ్యాన్ని పెంచడంలో ఈ కేంద్రం కీలకంగా మారనుందని చిలకా ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.మూడో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు రూ.3984.86 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. “ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అంతరిక్ష రంగంలో మరిన్ని విజయాలు సాధించి, ప్రపంచస్థాయి శక్తిగా ఎదగనుంది,” అని అన్నారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం స్థాపన, 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగాముల బృందం దిగిపడే లక్ష్యాలను సాధించేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని చిలకా ప్రవీణ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. “భవిష్యత్‌లో భారత అంతరిక్ష రంగం మరిన్ని విజయాలను సాధించి, ప్రపంచంలోని అగ్రగామిగా నిలుస్తుంది,” అని తెలిపారు.