*శ్రీరామ మార్గం ధర్మమార్గమని, ఆయన మార్గంలో నడిచినవారికి శ్రీరాముడి ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయి : నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*
శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే |
సహస్త్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే ||
శ్రీరామ మార్గం ధర్మమార్గమని, ఆయన మార్గంలో నడిచినవారికి శ్రీరాముడి ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ రామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాముడు ధైర్యానికి, నిజాయితీకి, శాంతికి ప్రతీక అని, ఎటువంటి విపత్కర పరిస్థితులలో అయినా సత్యానిష్ఠలతో జీవించాలన్న శ్రీరాముల వారి సుగుణాలు నేటి సమాజానికి ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరాముడి కృప ప్రతి ఇంట ఆనందంతో నింపాలని, అన్ని శుభాలు కలగాలని కోరారు. రాముడి ఆశీస్సులతో అందరి జీవితంలో శాంతి, ఆరోగ్యం, ధనసమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.