*శ్రీధర్ రెడ్డి సంస్కారం నేర్చుకో — రాష్ట్ర వైసీపీ నేత వైవి రామిరెడ్డి*

*శ్రీధర్ రెడ్డి…. నీ గత చరిత్ర ఏమిటో జిల్లా ప్రజలకు తెలుసు — వై.వి రామిరెడ్డి*

*అరాచకాలు, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి — వైవీ*

*నిత్యం అభివృద్ధిని ఆకాంక్షించేనాయకులు ఆదాల — వైవీ*

*శ్రీధర్ రెడ్డి…జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో– వైవీ*

*శ్రీధర్ రెడ్డి నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు… బయటపెట్టమంటావా — వైవీ*

*ఆదాల ప్రభాకర్ రెడ్డిని గురించి విమర్శించే నైతికస్థాయి, హక్కు నీకు లేదు — వైవీ*

*కరోనా కష్టకాలంలో రూ.45 లక్షల సొంత నిధులు ప్రజాసేవ కార్యక్రమాలకు జిల్లా అధికారులకు అందజేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి*

*శ్రీధర్ రెడ్డి ముందు నువ్వు సంస్కారం నేర్చుకో — వైవీ*

*ఓటమి భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నావు — వైవీ*

*రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రాష్ట్ర వైసీపీ నేత వైవిరామిరెడ్డి*

24 X 7 అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, రౌడీయిజం తదితర అసాంఘిక కార్యకలాపాలకు కేరా ఫొటోస్ అయినా నువ్వెక్కడ…?? అనునిత్యం జిల్లాలో ఏ ప్రాంతంలో పనిచేసిన ఆ ప్రాంతం అభివృద్ధిని ఆకాంక్షించే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎక్కడ..?? అనే విషయాన్ని ముందు నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ వైవిరామిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వైసీపీ రాష్ట్ర నాయకులు వై వి రామిరెడ్డి సూచించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి ఖచ్చితంగా తప్పదని భావించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మైండ్ దొబ్బి ఏమి మాట్లాడాలో తెలియక… ఏది పడితే అది మాట్లాడడం సంస్కారం అనిపించుకోదని రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు వై వి రామిరెడ్డి పేర్కొన్నారు. నిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే ఆదాల ప్రభాకర్ రెడ్డిని నిస్వార్ధపరుడు, వివాదారహితులు, అజాతశత్రువు, సేవాతత్పరులు ఎలా అనేక మంచి పేరు ప్రఖ్యాతలు గల మహోన్నత సేవకులుగా జిల్లా ప్రజలు పిలుచుకోవడం ఆనవాయితీ. అటువంటి మంచి వ్యక్తిని విమర్శించే స్థాయి, నైతిక హక్కు, సంస్కారం నీకు ఉందా..శ్రీధర్ రెడ్డి…?? అని వైసీపీ నాయకులు వైవి రామిరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసని ఆ విషయం కూడా నీకు తెలుసన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని ఈ సందర్భంగా వైవి రామిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితిల్లో జిల్లా ప్రజల సంక్షేమార్ధం రూ.45 లక్షల పైబడి జిల్లా ఉన్నతాధికారులకు అందజేసి సేవా కార్యక్రమాలు అందించాలని తన దాతృత్వాన్ని చాటుకున్న గొప్ప దారి సైనికుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎక్కడ…?? ఒక్క రూపాయి ఖర్చు పెట్టి వంద రూపాయలు ఆర్భాటం చేస్తే నువ్వెక్కడ… శ్రీధర్ రెడ్డి అని రాష్ట్ర వైసీపీ నాయకులు వైవిరామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను చేసిన సహాయాన్ని కనీసం తన చేతికి కూడా తెలియనివ్వని గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అదాల ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి విషయాలన్నీ జిల్లా ప్రజలకు పూర్తిగా తెలుసని…. నీ ఘనచరిత్ర ఏమిటో…?? నీ సంపాదన ఏమిటో అది కూడా జిల్లా ప్రజలు తెలుసు అని వైసిపి నాయకులు వైవిరామిరెడ్డి మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడే ముందు సంస్కారం అంతగా మాట్లాడడం నేర్చుకోవడం మంచి పద్ధతి అని ఆ విషయాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గుర్తుంచుకోవాలని వైవిరామిరెడ్డి సూచించారు. 2014 ముందు నీ దగ్గర ఉన్న నీ సన్నిహితులు, నీ స్నేహితులు నీకు అన్నివిధాల సంపూర్ణ సహకార సహకారాలు అందించిన మిత్రులు ఇప్పుడు ఏమయ్యారు వారు ఎక్కడున్నారు, వారు నీకు ఎందుకు దూరమయ్యారో.. ఆ విషయాల్ని బయట పెట్టమంటావా..?? అని రాష్ట్ర వైసీపీ నేత వైవిరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, జీవి ప్రసాద్, పాలకుర్తి రవికుమార్, సయ్యద్ హయత్ బాబా, టీవీఎస్ కమల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *