*శ్రీధర్ రెడ్డి దగ్గర విలువలేదు … టిడిపిలో ఇమడలేకనే ఆదాలన్న చెంతకు చేరా*
*ఆదాలన్న చెంతకు చేరడం సంతోషంగా ఉంది — గుంటూరు రామ్మోహన్ రెడ్డి*
*క్షణికావేశ నిర్ణయం విలువ తెలుసుకొని యూటర్న్ తీసుకున్న — రామ్మోహన్ రెడ్డి*
*ఆదాలన్న దగ్గర అభిమానం … టిడిపిలో అవమానం*
*వైసీపీలో తిరిగి చేరిక.. సొంత ఇంటిలోకి వచ్చినంత ఆనందంగా ఉంది– రామ్మోహన్ రెడ్డి*
*అభినందించి, ఆప్యాయంగా ఆహ్వానించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి*
*తాను తీసుకున్న క్షణికావేశ నిర్ణయం చాలా పెద్ద పొరపాటని కొద్దిరోజుల క్రితమే రూరల్ వైఎస్ఆర్సిపి నుండి తెలుగుదేశంలో చేరి తాను తీసుకున్న పొరపాటు నిర్ణయాన్ని వెంటనే తెలుసుకుని తిరిగి తన సొంత గూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వైనం ఇది*
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ చెందిన సీనియర్ నాయకులు గుంటూరు రామ్మోహన్ రెడ్డి కొన్ని తన వ్యక్తిగత కారణాలవల్ల కొద్దిపాటి పొరపాటు నిర్ణయంతో వైసీపీని వీడి టిడిపిలో చేరడం జరిగింది. శుక్రవారం రాత్రి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో గుంటూరు రామ్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. *అయితే సొంత ఇంటి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎంతో అభిమానం ఆప్యాయతగా చూసుకునే పెద్దాయన, స్నేహశీలి, వివాద రహితులు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి దూరంగా వెళ్లడం తాను చేసిన పెద్ద తప్పుగా తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి నమస్కారం పెట్టి, కార్యకర్తల విలువ తెలియని టిడిపి అభ్యర్థి కోటంరెడ్డికి బై.. బై చెప్పి*, తిరిగి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని గుంటూరు రామ్మోహన్ రెడ్డి చెప్పారు. నీతి నిజాయితీగా రాజకీయాల్లో కొనసాగాలనుకునే వారు తెలుగుదేశం పార్టీలో ఇమడలేరని, రూరల్ టీడీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి దగ్గర ఏ మాత్రం గౌరవం లేదని గుంటూరు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి *పెద్దలు, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి భారీ మెజార్టీ అందించేందుకు తన వంతు కృషి చేస్తానని గుంటూరు రామ్మోహన్ రెడ్డి తెలిపారు* తాను చేసిన పొరపాటును తెలుసుకుని సొంతగూటికి చేరిన గుంటూరు రామ్మోహన్ రెడ్డిని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించి, వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో తిరిగి చేరిన రామ్మోహన్ రెడ్డికి తగిన ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు సముచితమైన గౌరవం ఇవ్వడం జరుగుతుందని ఆయనకు అన్నివిధాలా పార్టీ అండగా ఉంటుందని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచల రెడ్డి, 24 వ డివిజన్ ఇంచార్జ్ ఉడత మురళి యాదవ్, కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి మూలే విజయ భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు బెజవాడ మేఘనాథ్ సింగ్, రొంపిచర్ల సుబ్బారెడ్డి, అశోక్ దాస్, జాకిర్, బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.