శివాజీ సెంటర్ మిత్రమండలి, నెల్లూరు ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు
స్థానిక ట్రంకు రోడ్డుశివాజీ సెంటర్ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద సోమవారం 351వచత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడైన హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలను శివాజీ సెంటర్ మిత్రమండలి, చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపన కమిటీ, మరాట మిత్రమండలి, హిందూ చైతన్య వేదిక లుసంయుక్తంగాఘనంగా నిర్వహించింది. తొలుత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పలు మోర్చాల ఇంచార్జ్ పి సురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పలువురు చత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 351 సంవత్సరాల క్రితం చత్రపతి శివాజీ మహారాజ్ పలు సంస్థానాలను ఏకం చేసి మోగలాయిలను ధీరధాతంగా ఎదుర్కొని హిందూ సామ్రాజ్య వారసుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. భారతీయ మహిళల ఆత్మగౌరాన్ని నిలిపిన వ్యక్తిని పేర్కొన్నారు. ఇదే క్రమంలో స్వాతంత్రోద్యమానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని సంస్థానాలను భారత దేశ చత్రం కింద తీసుకువచ్చారని ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ వీరి ఆశయాలను ఆకాంక్షలను అనుగుణంగా అన్ని రంగాల్లో భారతదేశం గురువుగా అవతరిచ్చేందుకు పనిచేస్తున్నారని కొని యాడారు. మహిళల ఆత్మగౌరవం కోసం ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం నిర్వహించిందన్నారు.
నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనను ఇదే రోజు పూర్తి చేసుకున్నారు అని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శివాజీ సెంటర్ నాయకులు కెవి సుబ్రమణ్యం, హర్షవర్ధన్, మహేష్, కుమార్,మధుసూదన్, బాలసుబ్రమణ్యం, సూరి, రాజశేఖర్, హరి, కిరణ్, కుమార్, శ్రీనివాసులు, మరాఠా మిత్ర మండలి నాయకులు ప్రకాష్ జగదేలే, బాజీరావు, స్వామీజీలు, పలువురు శివాజీ మహారాజ్ అభిమానులు పాల్గొన్నారు.