*శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడి చర్యను ఖండిస్తున్నాం : సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాదిగ*

నర్సీపట్నం పండుగలో ఉత్సాహంగా డప్పు కొడుతున్న దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అకారణంగా చేయి చేసుకోవడం పట్ల సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాదిగ తీవ్రంగా స్పందించారు . శాసనసభ స్పీకర్ గా ఉండి ఇలాంటి చర్యకు పాల్పడడం సిగ్గుచేటన్నారు .

గౌరవ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు దళితుడైన భాస్కర్ రావు చెంప చెళ్లుమనిపించారని , ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు .

స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ప్రజల పట్ల మర్యాదగా నడుచుకోవాలన్న కనీస జ్ఞానం అయ్యన్నపాత్రుడికి లేదా అని ప్రశ్నించారు . ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవాలని , వెంటనే అయ్యన్నపాత్రుడు మాదిగలకు క్షమాపణ చెప్పాలని , ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు .

గౌరవప్రదమైన శాసనసభను నడిపే స్పీకర్ తప్పు చేస్తే , రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు తప్పు చేసినట్లుగా భావించాలని , ఈ చర్యను రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని , రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ అయ్యన్నపాత్రుడిని వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు .
అలా జరగని పక్షంలో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed