వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పుతో బుద్ది చెప్పారు

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం (గొల్లపూడి) – 07 జూన్ 2024

అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

151 లో మధ్య 5 తీసేశారంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతుంది

జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాలను పారద్రోలారు

వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడిన బూతులు, భాష, వాళ్ళు చేసిన అవినీతి అరాచకాలకు తిరుగుబాటుగా ప్రజలు ఓటు వేశారు

మండుటెండల్లో చంద్రబాబు నాయుడు గారు రోజుకి మూడు నాలుగు ప్రసంగాలు సభలు నిర్వహించారు

కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలవడం, బాలయ్య బాబు యాత్రలు, నారా లోకేష్ యువగళం, భువనమ్మ గారి నిజం గెలవాలి, ప్రజా చైతన్య యాత్రలు కూటమికి విజయాన్ని ఇచ్చాయి

ఇచ్చిన మెజారిటీని రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి ఉపయోగిస్తాం. పోలవరం పూర్తి చేయాలి, రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి, విశాఖ కడప స్టీల్ ఫ్యాక్టరీలు విభజన హామీలు ఇవన్నీ చంద్రబాబు గారు పూర్తిచేస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed