*వైస్ ఛాన్స్ లర్ల రాజీనామాలపై కూటమి ప్రభుత్వ కుట్రలను ఆధారాలతో* సహా నెల్లూరు లో జరిగిన పాత్రికేయ సమావేశంలో బహిర్గతం చేసిన .. *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి..*

*చంద్రశేఖర్ రెడ్డి గారి కామెంట్స్..*

👉 *శాసనమండలిలో విద్యారంగ సమస్యలపై.. ప్రస్తావించగా కూటమి ప్రభుత్వ సభ్యులు మూకుమ్మడిగా .. తమపై దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు.*

👉 *శాసనమండలిలో కూటమి ప్రభుత్వ సభ్యుల తీరు బాధాకరమన్నారు.*

👉 *తమపై ఎలాంటి దాడులు చేసిన.. ప్రజా సమస్యలపై గళమెత్తడంలో వైయస్ఆర్సీపీ ఎప్పటికీ వెనకడుగు వేయదని తెలియజేశారు.*

👉 *అలాగే తాను టీచర్ ఎమ్మెల్సీగా.. విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించడంలో ఎక్కడ వెనక్కు తగ్గేది లేదన్నారు.*

👉 *రాజ్యాంగబద్ధమైన వైస్ ఛాన్స్లర్ల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వేలు పెట్టి ఉన్నత విద్యా మండలి విలువలను, బజార్లో పెట్టిందని అన్నారు.*

👉 *కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే 17 మంది వైస్ ఛాన్స్ లర్ల ను బెదిరించి ఒత్తిడి చేసి వారి చేత రాజీనామాలు చేయించారని అన్నారు.*

👉 *రాష్ట్ర గవర్నర్ గారి ఆమోదంతో నియమించే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లను అర్ధాంతరంగా తొలగించడం మంటే.. ఉన్నత విద్యా వ్యవస్థ ను అపహాస్యం చేయడమేనన్నారు.*

👉 *ఈ విషయంపై శాసనమండలిలో తాను మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించినప్పుడు.. నాపై టిడిపి సభ్యులు దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు.*

👉 *నేను బయట పెట్టిన విషయాలపై.. ఆధారాలు చూపాలని.. మంత్రి లోకేష్ అడిగారని అన్నారు.*

👉 *ఈ రోజు అందుకు సంబంధించిన ఆధారాలను ఈ సమావేశం ద్వారా బయటపెడుతున్నామని తెలిపారు.*

👉 *వైస్ ఛాన్స్లర్లను బెదిరించడం.. వారిపై దాడి చేసే ప్రయత్నం చేయడం వంటి వాటికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.*

👉 *వైస్ ఛాన్సులర్లు తమ పదవులకు రాజీనామాలు చేసే సమయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్.. ఆదేశాల మేరకే తాము రాజీనామా చేస్తున్నట్లు తెలియజేసిన లేఖలను విడుదల చేశారు.*

👉 *వైస్ ఛాన్స్లర్ల పై దాడి, విసీలపై రాజీనామాల ఒత్తిడి.. అంటూ పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్ లు, మిగిలిన ఆధారాలన్నిటిని మీడియాకు అందజేశారు.*

👉 *వైస్ ఛాన్స్ లర్ల పై… కూటమి ప్రభుత్వం చేసిన బెదిరింపులకు.. ఇదే ప్రత్యక్ష సాక్షాలన్నారు.*

👉 *రేపు శాసనమండలిలో… మండలి చైర్మన్ కు ఈ ఆధారాలు అందజేసి.. జ్యుడీషియరి విచారణ జరిపించాలని కోరుతామన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed