*వైస్సార్సీపీలోకి మాజీ కార్పొరేటర్ కుమారుడు గంగాధర్ యాదవ్*

*కండువాకప్పి పార్టీలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*వైసీపీ నాయకులు రొంపిచర్ల సుబ్బారెడ్డి, పుల్లూరు చంద్రమౌళి తదితరుల ఆధ్వర్యంలో చేరిక*

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26వ కార్పొరేషన్ డివిజన్ కు చెందిన చందులూరు గంగాధర్ యాదవ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ చందులూరు సుభాషణి కుమారుడు చందులూరు గంగాధర్ యాదవ్ తో పాటుగా ఆయన మిత్రబృందం 30 కుటుంబాలు వారు స్వచ్ఛందంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిగారి సమక్షంలో 26వ డివిజన్ వైసిపి ముఖ్య నాయకులు రొంపిచర్ల సుబ్బారెడ్డి, పుల్లూరు చంద్రమౌళి తదితరుల సహకారంతో స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు సంపూర్ణ సహకారం అందిస్తామని పార్టీల చేరిన చందలూరు గంగాధర్ యాదవ్ తెలిపారు. నెల్లూరు రూరల్ అభివృద్ధిని ఆకాంక్షించి తనపై నమ్మకంతో స్వచ్ఛందంగా పార్టీలో చేరిన చందలూరు గంగాధర్ యాదవ్, ఆయన మిత్రబృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ చెప్పారు. భవిష్యత్తులో చందలూరు గంగాధర్ యాదవ్ కు సముచితమైన, గౌరవప్రదమైన స్థానం కల్పించడం జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, క్లస్టర్ అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి, 26వ డివిజన్ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed