*వైసీపీ పాలనలో నాడు –నేడు అన్నారు..చివరకు వెతలు మిగిల్చారు*
*నారా లోకేష్ బాబు సారధ్యంలో విద్యారంగంలో విశేష మార్పులు*
*పొదలకూరులోని బీసీ బాలికల వసతి గృహంలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
9,10 తరగతుల విద్యార్థులకు నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులతో వీడియో పాఠాలు
రాష్ట్రంలో 103 సెంటర్లు ఉండగా జిల్లాలో నాలుగు ఉన్నాయి..అందులో రెండు పొదలకూరు మండలంలోనే
బీసీ హాస్టల్ విద్యార్థినుల కోసం అన్ని వసతులతో కూడిన భవనాన్నిఅందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏదో ఒక ఫండ్ మంజూరు చేయించే ప్రయత్నంలో ఉన్నాం
వైసీపీ పాలనలో నాడు అన్నారు…నేడు అన్నారు..చివరకు స్కూళ్లు, హాస్టళ్లలో వసతులు లేకుండా చేశారు
వీలైంత త్వరలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది
విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన నారా లోకేష్ బాబు విద్యా శాఖ మంత్రిగా అనేక మార్పులు తెస్తున్నారు
అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా