*20వ డివిజన్లో 14 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా*
*డివిజన్ ఇంచార్జ్ రావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసిన రాజీనామా చేసిన వాలంటీర్లు*
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దత్తుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని 20వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ సచివాలయం 1 పరిధిలోని పలువురు వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. ఆ డివిజన్ ఇంచార్జ్ రావు శ్రీనివాసరావు (ఆర్ఎస్ఆర్) ఆధ్వర్యంలో 14 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకునేందుకు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని, నెల్లూరు త్వరలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయడం జరుగుతుందని రాజీనామా చేసిన వాలంటీర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు పోతురాజు రమాదేవి, పోతురాజు చంద్రశేఖర్, కోవూరు ప్రకాష్ రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారు.