*వైసీపీలోకి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ అసోసియేషన్ సభ్యులు*
*షేక్ అమీర్జాన్, జాహిద్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరిక*
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 25వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ బుజబుజ నెల్లూరు ప్రాంతానికి చెందిన సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ అసోసియేషన్ సభ్యులు 50 మంది తోలుబొమ్మలాట వర్గానికి చెందిన వారు శనివారం నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిగారి సమక్షంలో ఆ డివిజన్ వైసీపీ నాయకులు షేక్ అమీర్ జాన్, షేక్ జాహిద్ ఆధ్వర్యంలో డివిజన్ పరిశీలకులు, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి సహకారంతో వైస్సార్సీపీలో స్వచ్చందంగా చేరారు. రూరల్ అభివృద్ధిని ఆకాంక్షించి పార్టీలో జరిగిన ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా అభినందిస్తూ, వారందరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని, భవిష్యత్తులో ప్రాణమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అన్నివేళలా అన్ని విధాల సంపూర్ణ సహకారాలందించి అండగా ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, రూరల్ పార్టీ పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవికుమార్, 25వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.