*వైసీపీకి జీవం పోస్తున్న ఇద్దరు నేతలు*

*.. మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఆ ఇద్దరు నేతలు*

.. సార్వత్రిక ఎన్నికల తర్వాత సున్నా మార్కుతో.. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత గడ్డు పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో… రాష్ట్రస్థాయిలో నిత్యం వార్తల్లో ఉంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తమ గళాన్ని వినిపిస్తున్నారు.

.. ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలను, ఎత్తుగడలను అమలు చేస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అనేక సమస్యలపై పూర్తిస్థాయి సమాచారంతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి శాసనమండలిలో తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా కేంద్రంలో దూకుడైన రాజకీయాలను చేస్తున్నారు. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అనుకున్న దశలో ఇద్దరు నేతలు వైసీపీని నిలబెట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.

ఆదివారం రాత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు భవిష్యత్తులో పార్టీ తరఫున చేయాల్సిన అనేక కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *