*వైసిపి నెల్లూరు నగర అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ నామినేషన్*
నెల్లూరు నగరంలోని రాజన్న భవన్ నుంచి రామమూర్తినగర్ నందు గల నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి గారి కార్యాలయానికి నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎండి.ఖలీల్‌అహ్మద్ గారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నగర నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్ళారు. అనంతరం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని కలిసి, ఆయన కార్యాలయంలో వేద పండితులు, ముస్లిం పెద్దలు, పాస్టర్ల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విజయసాయి రెడ్డి గారి కార్యాలయం నుండి నగర కార్పొరేషన్ కార్యాలయం వరకు కార్లలో ర్యాలీగా వెళ్లి కార్పోరేషన్ కార్యాలయంలో నగర నియోజకవర్గ అభ్యర్థిగా ఎండి. ఖలీల్ అహ్మద్ గారు నామినేషన్ దాఖలు చేశారు.