*వైయస్ఆర్ సీపీ పోరుబాటలో నిరసన ర్యాలీ విజయవంతం : నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి.*
నిరసన ర్యాలీలో ముఖ్యఅతిథిగా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లోని పరమేశ్వరి కళ్యాణ మండపం నుండి బాలాజీ నగర్ క్రాస్ రోడ్ మీదుగా మిలీనియం విద్యుత్ సబ్ స్టేషన్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, ప్రజలపై మోపిన అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సిపి శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలపై అదనపు విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్తు చార్జీలు పెంచము, ప్రజలపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మోసపూరితమైన హామీలు ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలపై అదరపు విద్యుత్ ఛార్జీల బారినమ్మపడం అన్నారు
నెల్లూరు నగర వైసీపీ సమన్వయ కర్త, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. నిరసన ర్యాలీ అనంతరం పార్లమెంటు పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర వైసిపి సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళ నాయకులు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు మిలేనియం విద్యుత్ సబ్ స్టేషన్ అధికారికి వినతిపత్రాన్ని అందించారు.
ఏకతాటిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ ఏకతాటిపై కలసి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ర్యాలీని విజయవంతం చేశారు. ప్రజల పక్షాన పోరాటం పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ సందర్భంగా మినీ బైపాస్ రోడ్ అంతా జనసందోహంగా మారింది.