*వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆనం గెలవాలి – చంద్రబాబు*
– ప్రజాగళం సభకు అశేషంగా తరలివచ్చిన జనం..
– కిటకిటలాడిన ఆత్మకూరు పరిసరప్రాంతాలు..
– సీబీఎన్ అంటే ఒక విజన్ – వి.పి.ఆర్
– ఆయన వస్తేనే రాష్ట్రం బాగు పడుతుంది
ఆత్మకూరు పసుపుమయం అయ్యింది. కనుచూపుమేర జన ప్రభంజనంతో కిటకిటలాడింది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడి నాయకత్వం ఆవస్యకతను తెలియజేసింది. ఎటుచూసినా ప్రజాగణం రాకతో ప్రజాగళం సభ దద్దరిల్లింది. ముందుగా ఆత్మకూరుకు హెలికాప్టర్లో చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుగారికి నెల్లూరు పార్లమెంట్ ఎన్‌డీఎ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిగారు ఘన స్వాగతం పలికారు. వి.పి.ఆర్ గారు చంద్రబాబు నాయుడుగారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వి.పి.ఆర్ గారు సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
చంద్రబాబు నాయుడుగారు మాట్లాడుతూ… నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు గెలవాలని అన్నారు. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేమిరెడ్డిని, ఆనంగారిని గెలిపించాలని ప్రజలను కోరారు. మంచిమనసున్న వ్యక్తులు పోటీ చేస్తున్నారని, ప్రజలందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు మాట్లాడుతూ… నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక వరమని, ఆయన సీఎం అయితే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్లేనన్నారు. పాలనలో విజన్ ఉన్న లీడర్… పాలసీల్లో పారదర్శకత ఉన్న లీడర్… రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన ఏకైన నాయకులు చంద్రబాబు గారు అని అన్నారు. ఆత్మకూరు గత పదేళ్లుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆత్మకూరులో ఆనం గారు చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని వివరించారు. చంద్రబాబు అంటే విజన్ అని, చంద్రబాబు అంటే అభివృద్ధి అని, చంద్రబాబు అంటే నమ్మకమని అన్నారు. జిల్లాలో పారిశ్రామికంగా చాలా అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. ఆనం రామనారాయణ రెడ్డిగారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి అని, ఆయన్ను ఆత్మకూరు ఎమ్మెల్యేగా, తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం మెట్టుకూరి ధనుంజయ్‌రెడ్డిగారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిగారు, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్య నాయుడుగారు, కంభం విజయరామిరెడ్డిగారు, ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.