
*వేమిరెడ్డి దంపతులను కలిసిన టిడిపి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్*
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను నూతనంగా నియమితులైన తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నెల్లూరులోని విపిఆర్ నివాసానికి వచ్చిన వారు.. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి సమర్థవంతంగా కృషి చేయాలని, తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎంపీ వేమిరెడ్డి దంపతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిరువురికి అభినందనలు తెలిపారు.