*SPS నెల్లూరు జిల్లా*

*వేదాయపాలెం, నెల్లూరు రూరల్, పొదలకూరు మరియు రాపూరు పోలీసు స్టేషన్ లను సందర్శించిన గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి,IPS.,*

 వేదాయపాలెం, నెల్లూరు రూరల్, పొదలకూరు మరియు రాపూరు పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ ఐజి గారు, జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారితో పాటు కలిసి సందర్శించడం జరిగినది.
 పోలీసు స్టేషన్ ల మ్యాప్ లను పరిశీలిస్తూ, స్టేషన్స్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై ఆరా..
 పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డుల పరిశీలించిన ఐ.జి. గారు.
 జిల్లాలో నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తప్పనిసరి.
 పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా IG గారు మాట్లాడి, వారి సమస్యను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుదారిని మర్యాదపూర్వకంగా పలకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విని, పరిష్కరించాలని ఆదేశించారు.
 జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్, ల్యాండ్ గ్రాబర్స్‌పై నిరంతరం నిఘా ఉంచాలి. వారి కదలికలపై ఇంటెలిజెన్స్ సేకరించి, లా అండ్ ఆర్డర్‌కు హాని కలిగించే ప్రయత్నాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.
 గాంజా సేవించే వారు, అమ్మే వారిపై కఠినంగా కేసులు నమోదు చేసి నెట్‌వర్క్‌ను పూర్తిగా డిస్మాంటిల్ చేయాలి.
 జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్లాక్ స్పాట్ లను గురించి, రోడ్డు భద్రత నియమాల గురించి వాహనదారులతో పాటు పట్టణ, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు.
 అన్ని పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలి.
 ముఖ్యంగా గ్రేవ్ క్రైమ్స్, ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులపై వేగవంతంగా విచారణ జరపాలని ఆదేశించారు.
 దొంగతనం కేసుల్లో కోల్పోయిన సొత్తును త్వరగా రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించాలి. రికవరీ రేటు పెరగాలి, దొంగల గ్యాంగ్స్‌పై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలి.
 సోషల్ మీడియా ద్వారా మహిళలను, వ్యాపారులను, సెలబ్రిటీలను బ్లాక్‌మెయిల్ చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలి. తగిన చర్యలు తీసుకోవాలి.
 పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రధమ కర్తవ్యం… పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి, వెంటనే పరిష్కరించేలా ఆదేశాలు..
 ఈ తనిఖీలో IG గారితో పాటు జిల్లా యస్.పి. గారు, సంబంధిత CI, SI గార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.09.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed